Home Page SliderTelangana

కేంద్ర కేబినెట్‌లో ఏ శాఖ తీసుకోవాలో కూడా కేసీఆర్ చర్చించారు, గుట్టువిప్పిన ఈటల

కేటీఆర్ వయసుకు తగ్గట్టుగా మాట్లాడు..
తర్వాత బాధపడి లాభం ఉండదని ఈటల హితవు
చిల్లర సైకోతో హుజూరాబాద్ ప్రజలను బెదరగొడ్తున్నారు..
వడ్డీతో సహా మొత్తం తిరిగి చెల్లిస్తానన్న ఈటల రాజేందర్

పరివార్ కి పదవులు ఇచ్చుకుంటున్న మాట నిజం కాదా ? నిజాం కాలం నాడు కూడా ప్రధానిగా హిందువులు ఉన్నారన్నారు ఈటల రాజేందర్. కిషన్ ప్రసాద్, రామ్ బక్షి, రాజా చందూలాల్ ఇలా హిందువులు ప్రధాని ఉంటే.. తెలంగాణ వచ్చాక మాత్రం.. పదవులన్నీ కూడా కుటుంబానికే ధారదత్తం చేశారన్నారు. 17 శాతం ఉన్న దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఏమిచ్చారని ప్రశ్నించారు. 52 % ఉన్న బీసీలకు ఇచ్చిన మంత్రులు మూడే మూడన్నారు. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ లాంటివి ఇచ్చి కీలక పదవులు ఫ్యామిలీ దగ్గర పెట్టుకున్నారని ఈటల మండిపడ్డారు. మాది కుటుంబ పార్టీ అని మీరే చెప్పుకుంటున్నారు.. మీ పార్టీ బతుకొనున్నంత కాలం.. పార్టీ అధ్యక్షుడు, సీఎం మీరు మీ కొడుకే అవుతారని కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ బీజేపీ అందరి పార్టీ.. అని, మోదీకి 140 కోట్ల మంది కుటుంబమన్నారు.

ముఖం బాగాలేకుంటే… అద్దం ఎందుకు పగుల గొడుతున్నారని… లెక్క తక్కువ కాకుండా అన్నింటికీ సమాధానం చెప్తామన్నారు ఈటల. సంస్కారం, సభ్యతతో వ్యవహరించాలని గులాబీ నేతలకు ఈటల హితవు పలికారు. భట్టి విక్రమార్క ప్రధానిని విమర్శిస్తే, ప్రధాని అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని చెప్పిందే మీరేనన్న విషయం మరచారా అని ఈటల ప్రశ్నించారు. బరిగీసి కొట్లాడుదాం, కాచుకో అని ప్రధాని అన్నారు. దానికి కాచుకొండి. చిన్నగా మాట్లాడి స్థాయి తగ్గించుకోవద్దన్నారు. ఎవరు మునుగుతారో ప్రజలు తెలుస్తారని… రేవంత్ రెడ్డి మతి లేని మాటలకి నేనేం సమాధానం చెప్పాలన్నారు ఈటల. గాలి వార్తలు సృష్టించే వారు ఎక్కువ అయ్యారన్నారు.

నాడు కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్నది నిజమని… కేటీఆర్‌ను సీఎం చేసి కేంద్రంలో కేసీఆర్ మంత్రి కావాలనుకున్నారని ఈటల చెప్పారు. కేబినెట్ లో చేరాక.. ఏ మంత్రి పదవి తీసుకోవాలన్నదానిపైనా చర్చ పెట్టుకున్నారని ఈటల ఎద్దేవా చేశారు.
ఒడ్డెక్కేదాక ఓడ మళ్ళప్ప, ఓడ దిగాక బోడ మళ్ళప్ప అన్నట్టు.. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయాయి… నేను సీఎం అయ్యాను. మీ తిప్పలు మీరు పడంటని ఎంపీ అభ్యర్థుల్ని గాలికి వదిలేశారన్నారు ఈటల. ఇతరుల మీద బురద జల్లే ముందు మీది మీరు సరిచూసుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్‌లో చిల్లర సైకో గాన్ని తీసుకొచ్చి నా ప్రజలను వేధిస్తున్నారని… వడ్డీతో సహా చెల్లిస్తానని ఈటల స్పష్టం చేశారు. నన్ను కదలకుండా చేయాలని చూస్తున్నారు. నా లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడమేనని ఈటల స్పష్టం చేశారు. డిపాజిట్లు రావు అని కేటీఆర్ అంటున్నారు కానీ ప్రజలే చరిత్ర నిర్మాతలని హుజూరాబాద్ ఎవరి జాగీరు కాదని.. అది ప్రజల జాగీరన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.