Home Page SliderTelangana

ఇవాళ హైదరాబాద్ కు కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ..

డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు.. బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత వస్తున్న సందర్భంగా 500 కార్లతో పార్టీ నాయకులు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. తర్వాత తన తండ్రి కేసీఆర్ తో కవిత భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి ఆమె నివాసానికి చేరుకుంటారు. అయితే.. ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్ కు బయల్దేరుతారు. సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.