Home Page SliderTelangana

తెలంగాణ తలవంచదు…ఈడీ నోటీసులపై కవిత స్పందన..

ఈడీ నోటీసులపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ తలవంచదన్నారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి మార్చి 10న మా ధర్నాకు ముందు, మార్చి 9న ED విచారణకు పిలిచిందన్నారు. తాను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన కవిత, ఈడీ విచారణకు హాజరుపై న్యాయపరమైన సలహా తీసుకుంటానన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని ఆమె స్పష్టం చేశారు.

కవితకు నోటీసులపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ మంత్రులు. మహిళల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి పువ్వాడ అజయ్. మొదట్నుంచి బీజేపీ ఒక పాలసీ ప్రకారం పనిచేస్తోందన్నారు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కవితను అరెస్టు చేసినా.. తాము వెనుకంజ వేయబోమన్నారు. కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు. కవితకు నోటీసులు బీజేపీ కుట్రలో భాగమన్నారు మరో మంత్రి గంగుల కమలాకర్.

కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ స్పందించింది. ఈడీ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు మంత్రి డీకే అరుణ. కవిత ఒక్కరే తెలంగాణ ఆత్మగౌరవం కాదన్నారు. కవిత నోటీసులపై కాంగ్రెస్ స్పందించింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవిత మండగలిపారన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.