కాశ్మీర్ సీఎం మారథాన్ రికార్డు
కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి మారథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్నా ఆయన రికార్డు సృష్టించారు. రెండు గంటలలోనే 21 కిలోమీటర్లు పరిగెత్తి మారథాన్ చాంఫియన్‌గా నిలిచారు. నేటి ఉదయం జెండా ఊపి ఈవెంట్‌ను ప్రారంభించారు. 13 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 2 వేల మంది అథ్లెట్లు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. వీరిలో స్థానికులు 35 మంది ఉన్నారు. కశ్మీరులో జరిగిన తొలి అంతర్జాతీయ ఈవెంట్‌గా దీనిని చెప్పవచ్చు. తన జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరిగెత్తలేదని, ఈ మారథాన్ తనకు ప్రత్యేకంగా ఉందన్నారు. తాను ఎలాంటి శిక్షణ లేకుండానే ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. 90 శాసనసభ స్థానాలలో ఒమర్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 సీట్లలో గెలిచి అధికారం చేపట్టింది.