USA లోనూ కార్తికేయ-2 జోరు
సూపర్ హిట్ మూవీ కార్తికేయ-2 సినిమా కలెక్షన్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.180 కోట్ల గ్రాస్ , రూ.50 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ USA లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. 1.5 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి నాలుగు వారాలు అవుతున్నా.. ఇంకా 80 థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. కార్తీకేయ మూవీ సీక్వెల్‌గా , కార్తీకేయ-2ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా చందు మెండెటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ నటించారు. నిఖిల్ కెరీర్లో సినిమాలన్నింటిలో ఇదే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

