ముడా భూ కుంభకోణంలో లోకాయుక్తకు కర్నాటక సీఎం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నాటక ముడా భూకుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం సిద్దారామయ్య బుధవారం లోకాయుక్తకు హాజరయ్యారు.మైసూర్‌లోని లోకాయుక్త కార్యాలయంలో సీఎం రామయ్యను ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో లోకాయుక్త కార్యాలయం పరిసరప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కుంభకోణంలో నిజానిజాలు నిగ్గుతేలాలంటే సీబిఐ ఎంక్వయిరీ వేయాలని బీజెపి గట్టిగా డిమాండ్ చేస్తున్న తరుణంలో సిద్దా రామయ్య లోకాయుక్తకు హాజరు కావడంతో కన్నడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.