NationalNews

త్వరలో కర్ణాటక అసెంబ్లీకి జూ. ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూ. ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నవంబర్‌ 1న కర్ణాటక అసెంబ్లీలో జరుగనున్న `కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో చీఫ్‌ గెస్ట్‌గా పాల్గొననున్నారు. ఇప్పటికే కర్ణాటక సీఎంఒ కార్యాలయం నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు `కర్ణాటక రత్న` అవార్డు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్‌తోపాటు రజనీకాంత్‌, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత చంద్రశేఖర్‌ కంబర్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.