కరాచీ బేకరీ సంచలన నిర్ణయం..
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ అతి పెద్ద నగరమైన కరాచీ పేరుతో ఉన్న బేకరీని పేరు మార్చమంటూ ఆందోళనలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కరాచీ బేకరీ తప్పు దిద్దుకునే పనిలో పడింది. కరాచీ బేకరీ అనేది హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బిస్కెట్ల బ్రాండ్. ఉస్మానియా బిస్కెట్లకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్ నగరంలో సామాన్య ప్రజలలో టీ కేఫ్‌గా ప్రసిద్ధి చెందింది. పాక్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం నగరంలోని తమ శాఖలపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించింది. ఆ బేకరీపై దాడులు జరగవచ్చనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ పని చేస్తుంది. నగరంలో దాదాపు 20 కరాచీ బేకరీ దుకాణాలు ఉన్నాయి. కరాచీ యాజమాన్యం ఉన్నత అధికారుల విజ్ఞప్తి మేరకు స్థానిక పోలీసులు కూడా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలోనే 20 శాఖలు కలిగి ఉంది. అలాగే అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ బేకరీ బిజినెస్ జరుగుతోంది. ప్రతిరోజూ 10 టన్నులకు పైగా బిస్కెట్లను ఉత్పత్తి చేస్తుంది. దీని వార్షిక ఆదాయం దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. దీనిని 1953లో ఖాన్‌చంద్ రామ్నాని అనే సింధీ కుటుంబం ప్రారంభించింది. వారు దేశవిభజన సమయంలో పాక్‌లోని కరాచీ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చింది. దీనితో వారు కరాచీ నగరం పేరు పెట్టుకున్నారు.

