IMDB రేటింగ్‌లో బాహుబలి, ట్రిపుల్ ఆర్ మరీ అంత దారుణంగానా?
కాంతార సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ప్రకటించిన “టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్” లిస్ట్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్మకత్వం వహించిన ఈ సినిమా అధిక వసూళ్లతో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సీన్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించినట్టు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు తెలియజేసింది. నంబర్ వన్‌గా కాంతార ఉండగా రెండో స్ధానంలో రామాయణ (1993) , 3 లో రాకెట్రీ (2022) , 4వ స్థానంలో నాయకన్ (1987) , 5లో అన్బే శివం (2003) , 6లో గోల్‌మాల్ (1979) , 7లో జై భీమ్ , 8లో 777 ఛార్లీ , 9లో పరియెరమ్ పెరుమాళ్ (2018) , 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి. ఇక తెలుగు సినిమాల జాబితాకు వస్తే కేరాఫ్ కంచరపాలెం 17 వ స్థానం , జెర్సీ 22 , సీతారామం 39 , మహానటి 44 , ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 48 , బహుబలి: ది కంక్లూజన్ 101 , బొమ్మరిల్లు 125 , రంగస్థలం 129 , అతడు 134 , పెళ్లి చూపులు 146 , ఎవరు 155 , క్షణం 156 , మేజర్ 165 , వేదం 176 , అర్జున్ రెడ్డి 179 , బాహుబలి: ది బిగినింగ్ 182 , ఆర్ఆర్ఆర్ 190 , ఒక్కడు 209 , పోకిరి 212 , మనం 217 , ఊపిరి 220 , హ్యాపీడేస్ 236 , గూఢచారి 244 స్థానాలలో ఉన్నాయి.

