బ్యాంకులో కన్నడ రచ్చ..ముఖ్యమంత్రి ట్వీట్
కర్ణాటకలోని బెంగళూరులోని ఎస్బీఐ బ్యాంక్ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్‌కు కన్నడ భాష రాకపోవడం తప్పయ్యింది. విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకూ పోయింది. బ్యాంకు మేనేజర్ తనకు కన్నడ రాదని, హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడడం వల్ల కస్టమర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మేనేజర్ తాను ఎప్పటికీ కన్నడలో మాట్లాడను అని చెప్పడంతో వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేయగా, బ్యాంక్ ఆమెను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. బ్యాంక్ మేనేజర్లు కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించాలని, స్థానిక భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా రాష్ట్రాల భాష, సంస్కృతి వంటి విషయాలలో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రక్షణ వేదిక సంఘం ఎస్బీఐ ఉద్యోగుల తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించింది.

