Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

క‌న్న కొడుకే కాల‌య‌ముడు

బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ర‌క్తం పంచి ఇచ్చిన క‌న్న వారిని ర‌క్తం చిందేలా హ‌త‌మార్చాడు.క‌ని పెంచి విద్యాబుద్దులు నేర్పిన తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా చంపాడు. అప్పికట్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచ‌ర్ విజయభాస్కర్,తల్లి సూర్యకుమారిని క‌న్న కొడుగు పల్లెపోగు కిరణ్ దారుణాతిదారుణంగా గొడ్డ‌లితో నరికి చంపేశాడు. ప్రస్తుతం చీరాలలో పోస్టాఫీసు ఉద్యోగిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న కిర‌ణ్ …త‌న త‌ల్లిదండ్రులు ఉంటున్న నివాసానికి అర్ధ‌రాత్రి చేరుకుని వారిని ఇంటి లోప‌ల నుంచి బ‌య‌ట‌కు పిలిచి మ‌రీ గొడ్డ‌లితో హ‌త్య చేశాడు.హంత‌కుడు ప‌రారీలో ఉన్నాడు.స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.