Andhra Pradesh

ఆస్ట్రేలియాలో రోజా వెంటపడ్డ కంగారు

ఎప్పుడు చూసినా రాజకీయాలు ,  టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉండే ఏపీ మినిస్టర్ రోజా ,  రిలీఫ్ కోసం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. అక్కడ దిగిన వెంటనే రోజాకు ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆహ్వానం పలికారు. అనంతరం రోజా ఫ్యామిలీతో కలిసి బల్లారట్ నేషనల్ పార్కులో ఎంజాయ్ చేశారు. అక్కడ ఉన్న కంగారూలతో సరదాగా ఆటలాడారు. అయితే పార్కులో రోజా చేతిలో ఉన్న ఆహారం కోసం ఓ కంగారు పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.