మోనాలిసాపై కంగనా సంచలన వ్యాఖ్యలు
మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కుంభ మేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తోంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్దతి ఎంత మాత్రం బాగా లేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేం. చిత్ర పరిశ్రమలోనూ చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపైనా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా? దీపికా పదుకొణె, కాజోల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా? మోనాలిసాను వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపైనా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి’ అని ఇన్ స్టా పేజీలో పేర్కొన్నారు.