Home Page SliderTelangana

కంగనా ఎమర్జెన్సీ చిత్రానికి తెలంగాణలో బ్రేక్..

బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ చిత్రానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో తమ వర్గాన్ని ఉగ్రవాదులుగా చూపించారని, దోశద్రోహులుగా ముద్ర వేశారని 18 మంది సిక్కుల బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన న్యాయనిపుణుల అభిప్రాయాలను స్వీకరించి, ఈ సినిమాను నిషేధించే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రాన్ని తెలంగాణలో ప్రదర్శించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రానికి స్వయంగా కంగనానే దర్శకత్వం వహించడం విశేషం.