Home Page SliderNationalNews AlertTrending Today

కుంభమేళాలో కండల బాబా

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో గంగా, యమునా,సరస్వతీ సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. దీనికి విదేశీయులు కూడా పోటెత్తుతున్నారు. కొందరు వినూత్నంగా ఉండే బాబాలు మీడియా కంట పడుతున్నారు. రుద్రాక్ష బాబా, సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ బాబా అలాంటి వారే. అలాగే రష్యాకు చెందిన కండల బాబా కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. అతని అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహరాజ్. ప్రస్తుతం నేపాల్‌లో నివసిస్తున్నారు. ఆయన 30 ఏళ్ల క్రితం హిందూ మతాన్ని స్వీకరించానని పేర్కొన్నారు. ఒకప్పుడు రెజ్లర్ కావడంతో అతనికి బలమైన శరీరం ఉంది. దీనితో అతనిని పరశురామునిగా పిలుస్తున్నారు భక్తులు. ఆయన ఇప్పటికీ గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకూ కొనసాగుతుంది.