Home Page SliderNational

సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో కళ్యాణ్ రామ్ చిత్రం

హీరో కళ్యాణ్ రామ్ వరుసగా కొత్త సినిమాలను తీస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లో మూవీ తీస్తుండగా, నెక్ట్స్‌ బింబిసార-2 సెట్స్‌పైకి పంపుతున్నారు. తాజాగా కుమారి 21F ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లోనూ ఇంకో సినిమాకి హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథపై చర్చలు పూర్తయ్యాయని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై దీన్ని సినిమాగా తీస్తారని సమాచారం.