ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేయాలి..!
మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా KTR చేసిన కామెంట్స్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. KTR చేసిన కామెంట్స్‌లో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఆరోపణలను వెంకట్‌రెడ్డి తిప్పికొట్టారు. మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేశారని ఇలా ఆరోపిస్తున్నారన్నారు. తాను ప్రచారానికి వెళ్లాలని ఉన్నప్పటికీ ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ఆలోచిస్తున్నానన్నారు. అయినప్పటికీ అవసరమైతే ప్రచారానికి వస్తానని చెప్పానన్నారు. KTR ఆరోపించినట్టు తాను అసలు కాంట్రాక్టర్నే కాదన్నారు. అంతేకాకుండా తాను KTR లా తండ్రి చాటు బిడ్డని కాదన్నారు. తెలంగాణా ఉద్యమంలో KTR ఎక్కడున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా జగదీష్ రెడ్డి ఒక హంతకుడని తీవ్ర విమర్శులు చేశారు వెంకట్ రెడ్డి. జగదీష్‌రెడ్డి అక్రమ సంపాదన గురించి తనకు అంతా తెలుసనన్నారు. అసలు ప్రచారంలోనే లేని నన్ను కోవర్ట్ అని తిట్టడం ఏంటని ప్రశ్నించారు. నా జోలికి వస్తే అందరి బండారం బయటపెడతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

