Home Page SliderNational

త్వరలో OTTలోకి రానున్న “కల్కి”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కల్కి”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తు రూ.1000కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్‌ని OTT లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో కల్కి సినిమా దక్షిణాది భాషల OTT హక్కులను అమెజాన్ ప్రైమ్,హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కల్కి సినిమా మరో 7-8 వారాల తర్వాత OTTలోకి వస్తుందని ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఈ మేరకు “కల్కి” సినిమా ఆగస్టు 15న OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.