కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజినీర్లు హాజరు
టిజి: కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో భాగమైన మూడు బ్యారేజీల డ్యామేజీపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ తన ఎంక్వైరీని వేగవంతం చేసింది. లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల నిర్వహణలో పాలుపంచుకున్న చీఫ్ ఇంజినీర్ మొదలు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వరకు మొత్తం 14 మంది కమిషన్ ముందు హాజరై వివరాలు తెలియజేశారు.