కర్నాటక కకావికలం
కర్నాటక లో ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.పరిపాలన అస్థవ్యస్థంగా మారింది.ఓ వైపు బీహార్ ముఠా బందిపోట్లలా బ్యాంకులను లూఠీ చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే…మరో వైపు పరిపాలనా అధ్యక్షుడిగా భావించే సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం మెడకు అక్రమాస్తుల ఉచ్చు బిగుసుకుంటోంది.కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినా … అక్కడ ప్రజలకు సుఖవంతమైన,శాంతియుతమైన పాలన అందించలేని దుస్థితి నెలకొంది.కేంద్రంలో బీజెపి అధికార పెత్తనం చెలాయిస్తుండటంతో కర్నాటకలో అశాంతియుత పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు వాదిస్తున్నారు.సీఎం సిద్దారామయ్యను కేసుల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో ఆయన గత రెండు నెలల కిందట లోకాయుక్త విచారణకు హాజరయ్యారు.తాజాగా ఈడి ఆయన ఆస్తులను ఎటాచ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సిద్దా రామయ్యకు చెందిన రూ.300కోట్ల విలువైన భూములు,భవనాలను ఎటాచ్ చేసింది.