సైబర్ నేరగాడికే బురిడీ కొట్టి డబ్బు వసూలు..
ఇటీవల అభ్యంతరకరమైన వీడియోలు మార్ఫింగ్ చేసి, పంపించి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేసే సైబర్ నేరగాళ్ల సంగతి ప్రతీరోజూ వార్తల్లో వింటున్నాం. కాన్పూర్‌కు చెందిన విద్యార్థి భూపేంద్రసింగ్‌కు సీబీఐ ఆఫీసర్‌నంటూ ఫోన్ చేసిన వ్యక్తితో తెలివిగా వ్యవహరించి ఆ సైబర్ నేరగాడికే టోపీ పెట్టి డబ్బు వసూలు చేశారు. భూపేంద్ర అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని, కేసును మూసివేయడానికి లంచం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. సైబర్ నేరగాడికి భయపడినట్లు నటించి, తన తల్లికి చెప్పొందంటూ వేడుకున్నారు భూపేంద్ర. అనంతరం తన వద్ద బంగారు గొలుసు తాకట్టు పెట్టానని, దానిని విడిపించడానికి డబ్బు కావాలంటూ అతడినే అడిగాడు. గొలుసు విడుదల చేసి డబ్బు ఇస్తానంటూ నమ్మబలికాడు. దీనితో మూడు దఫాలుగా రూ.10 వేలు భూపేంద్ర ఖాతాకు బదిలీ చేశాడు ఆ సైబర్ నేరగాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి భూపేంద్రను డబ్బు తిరిగివ్వాలంటూ వేడుకున్నాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు భూపేంద్ర.