Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తరచుగా తెలంగాణా కాంగ్రెస్ నేతలతో భేటి అవుతూ ఉండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవితో పాటు కొల్లాపూర్ నేత జగదీశ్వర్ రావుతో భేటి అయ్యారు. అయితే వీరిద్దరితో జూపల్లి విడివిడిగానే భేటి అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ భేటిలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలకు బలం చేకూరుతుంది.