Home Page SlidermoviesNationalNews Alert

అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఅర్ తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తనను కలుసుకోవడానికి ఎక్కువ ప్రయాస పడి రావద్దని, తాను తప్పకుండా అభిమానులను కలుస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కుప్పం నుండి పాదయాత్ర చేసి, హైదరాబాద్‌లో పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. తన అభిమానుల కోసం త్వరలోనే వారి కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు. ఈ సమావేశానికి పోలీసుల అనుమతితో శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకుంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 చిత్రం, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మరో చిత్రంలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నసంగతి తెలిసిందే.