బోయ్ ఫ్రెండ్ కోసం గోడ దూకి విద్యుత్ షాక్ కి గురయ్యింది
విశాఖ లేడీస్ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న పశ్చిమ బెంగాల్‌కి చెందిన విద్యార్ధిని అదే కళాశాల హాస్టల్ లో ఉంటుంది.బోయ్ ఫ్రెండ్ కోసం బుధవారం అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకే క్రమంలో గోడ పక్కనే ఉన్న ట్రాన్స్పార్మర్‌ని పట్టుకుంది.అది హై ఓల్టేజ్ ట్రాన్స్పార్మర్ కావడంతో విద్యుత్ షాక్ కి గురయ్యింది.శరీరం అంతా కాలిపోయింది.దాదాపు 50 శాతం గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళ్తున్న వారు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు.వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.అయితే ఈ వ్యవహారాన్ని హాస్టల్ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణ చేపట్టారు.