జెత్వానీ కేసులో హైకోర్టు తీర్పు
ఏపి రాజకీయాల్లో అగ్గి రాజేసిన బాలీవుడ్ హీరోయిన్ జెత్వానీ కేసులో ఏపి కి సంబంధించిన ముగ్గురు ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇష్యూ చేసింది.పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, గున్నీలకు ఊరట కల్పిస్తూ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, అడ్వొకేట్ వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ ముగ్గురు ఐపీఎస్ లను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

