జూ.ఎన్.టి.ఆర్ ‘దేవర’ సాంగ్ ఒక రికార్డ్
యూట్యూబ్‌లో రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లే సాంగ్ మూడో స్థానంలో ఉంది. ఈ పాటకు ఇరవై నాలుగ్గంటల్లో 15.68 ఎమ్ వ్యూస్ వచ్చాయి. ధమ్ మసాలా (17.42 ఎమ్), పెన్నీ సాంగ్ (16.78 ఎమ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కళావతి (14.78 ఎమ్), మమ మహేశా (13.56 ఎమ్) 4, 5 స్థానాల్లో నిలిచాయి. టాప్-5లో 4 మహేష్‌బాబు సినిమాల్లోని పాటలే ఉండటం విశేషం.


 
							 
							