జూ.ఎన్టీఆర్ నటించిన 30వ సినిమా “దేవర”
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి జూ.ఎన్టీఆర్ యాక్షన్ నుండి వస్తున్న 30వ సినిమా ఇది కాగా, ఫ్యాన్స్‌లో ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌కి ఎంతగానో నచ్చేసింది. దీంతో పాటుగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా సెన్సార్‌లో సెన్సార్ యూనిట్ కట్స్ చెప్పిన సీన్స్ గురించి వివరాలు తెలుస్తున్నాయి. వాటిలో ఒకతను తన భార్య కడుపు మీద తన్నే సీన్ ఒకటి, అలాగే కుంజర అనే అతని కొడుకు తన తల్లిని కొట్టే సీన్ ఇంకా కత్తికి వేలాడదీసిన ఒక బాడీ సీన్ ఫైనల్‌గా సొరచేప విజువల్‌లో సిజిఐ మార్క్ వేయలేదని ఈ నాలుగు సీన్స్ కట్ చేశారట. ఇలా టోటల్‌గా 7 సెకండ్స్ కట్స్‌లో 2 సెకండ్స్ రీప్లేస్ చేసినట్టుగా తెలిసింది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా సినిమా రిలీజై తెరమీద బొమ్మ పడడానికి, ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమౌతోంది.


 
							 
							