Andhra PradeshNews Alert

చిన్నారుల్లో ఆ సమస్య అందుకే వస్తోంది…!

పౌస్టికాహారం సంపూర్ణ ఆరోగ్యం గురించి అవగాహణ కల్పిస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి బృందవన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వరకు వాకాథాన్ పాదయాత్ర నిర్వహించారు. పిల్లల ఎదుగుదలకు పౌస్టికాహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌస్టికాహార లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని ఏలా నియంత్రించాలి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాదయాత్రను నిర్వహించారు. అయుతే ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజా కుమారి , నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ షేక్.సజీల , పలువురు అధికారులు , విద్యార్థులు పాల్గొన్నారు.