Home Page SliderInternational

సైన్యంలో చేరితే భారీ బహుమానం- రష్యా

సైన్యంలో చేరితే భారీ బహుమతులు, వేతనం ఇస్తామంటూ రష్యన్ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది రష్యా ప్రభుత్వం. సైనిక దళాల బలోపేతానికి చాలా కృషి చేస్తోంది. ఉక్రెయిన్‌తో ఎడతెగని యుద్ధం కారణంగా భారీగా సైనికులను నష్టపోయింది రష్యా. దీనితో యువత సైన్యంలో చేరడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్కో యువత సైన్యంలో చేరితే 1.9 మిలియన్ రూబుల్స్ సైనింగ్ బోనస్ ఇస్తామంటూ నగర మేయర్ ప్రకటించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.18 లక్షలు ఉంటుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి ఏటా 5.2 మిలియన్ రూబుల్స్ ( రూ.48.8 లక్షలు) ఉంటుందని సెర్గీ సోబియానిన్ వివరించారు. అంతేకాక యుద్ధంలో గాయపడిన వారికి, తీవ్రతను బట్టి  5,690 నుండి 12,000 డాలర్ల వరకూ ఇస్తారు. మరణించిన వారి కుటుంబాలకు 34,150 డాలర్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో రెండేళ్లుగా 87 శాతం సైన్యాన్ని కోల్పోయినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాలు వేస్తోంది.