రేపు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న బైడన్
గతకొన్ని రోజలుగా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేస్తున్నవిషయం తెలిసందే. కాగా ఈ భీకర దాడిలో ఇప్పటికే ఎన్నో వందల మంది ఇజ్రాయెల్ సైనికలతోపాటు ఆ దేశ పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా హమాస్ ఉద్రవాద దాడుల్ని బలంగానే తిప్పికొడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అయితే అగ్రరాజ్యం అమెరికా మొదటి నుంచే ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ వస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రేపు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.కాగా హమాస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆ దేశానికి వెళ్లనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ట్వీట్ చేశారు. అయితే అక్కడి నుంచి జోర్డాన్ వెళ్లి స్థానిక నేతలతో సమావేశమవుతానని ,మానవతాపరమైన అవసరాలపై చర్చిస్తానని బైడన్ తెలిపారు. ఈ క్రమంలో పాలస్తీనా ప్రజల హక్కులకు హమాస్ ప్రతినిధి కాదని వారికి స్పష్టం చేయనున్నట్లు జో బైడన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు.

