ఎస్‌బీఐలో ఉద్యోగం….!రాత పరీక్షల అవసరం లేదు, ఎంపికైనవారికి రూ. లక్ష జీతం
ఎస్‌బీఐ (State Bank of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు నెలకు ₹64,820 నుంచి ₹93,960 వరకు జీతం పొందవచ్చు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు, ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి 23 నుంచి 32 సంవత్సరాలు మధ్య ఉండాలి.
పోస్టుల వివరాలు:
అన్ రిజర్వుడ్ కేటగిరీ: 62
మొత్తం పోస్టులు: 150
ఎస్సీ కేటగిరీ: 24
ఎస్టీ కేటగిరీ: 11
ఓబీసీ కేటగిరీ: 38
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ: 15
దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు ₹750, స్సీ, ఎస్టీ, దివ్యాంగులు: ఫీజు మినహాయింపు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..