BusinessHome Page SliderInternationalNews Alert

మస్క్ స్టార్ లింక్‌తో జత కట్టిన జియో, ఎయిర్ టెల్

ప్రముఖ భారత టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్‌లు రెండూ ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఏరో స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అనుబంధంగా ఉన్న స్టార్‌లింక్ సర్వీసెస్‌తో జత కట్టనున్నాయి. శాటిలైట్ ఆధారిత సేవల కోసం వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా మారుమూల గ్రామాలకు సైతం ప్రపంచస్థాయి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయని పేర్కొన్నాయి. ఎయిర్ టెల్ రిటైల్ స్టోర్‌లలో స్టార్ లింక్ పరికరాలను అందించడం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానించే అవకాశాలను జియో, ఎయిర్ టెల్ అన్వేషించనున్నాయి.