జేఈఈ ఫలితాలు..కటాఫ్ మార్క్స్ ఇవే..
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో బీటెక్ కోర్సు ప్రవేశాల కోసం ఏప్రిల్ 2 నుండి 8 వరకూ జరిగిన ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇద్దరికి 100 పర్సంటైల్ రావడం విశేషం. హైదరాబాద్‌లోనే చదువుకుంటున్న బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డిలు 300 మార్కులకు గాను, 300 మార్కులు సాధించారు. అజయ్ రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లాలోని తాటిపాడు. కటాఫ్ స్కోరును జనరల్ విభాగంలో 93.102, ఈడబ్లూఎస్-80.383, ఓబీసీ-79.431, ఎస్సీ-61.15, ఎస్టీ-47.90 గా నిర్ణయించారు. ఈ స్కోరు దాటిన వారు మే 18న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.