Home Page SliderNationalNews Alert

జేఈఈ మెయిన్స్ మొదలు..భారీగా విద్యార్థులు హాజరు

తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షల సందడి మొదలయ్యింది. పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారీగా విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుతుండడంతో హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. 22,23,24,28,29 తేదీలలో ఎన్‌ఐటీలలో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 నిర్వహిస్తారు. జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోసం పేపర్ 2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నరకి పైగా హాజరవుతున్నారు. హైదరాబాదే కాకుండా, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలలో కూడా పరీక్షా కేంద్రాల వద్ద హడావిడి కనిపిస్తోంది.