జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానం మార్పు
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు పోటీ పడే పరీక్ష జేఈఈ మెయిన్స్. దేశంలోనే కఠినమైన పోటీ పరీక్షా విధానంగా పేరు పొందింది. ఈ సంవత్సరం నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షా విధానంలో కీలక మార్పులు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భావిస్తోంది. ఇకనుంచి సెక్షన్ బి లో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని పేర్కొంది. గతంలో కరోనా కారణంగా విద్యార్థులకు ఈ ఆప్షన్స్ వెసులుబాటు కల్పించామని, 2024 వరకూ ఈ విధానం కొనసాగించామని తెలిపింది. 10 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలు మాత్రం రాసే విధానం ఉండేది. ఇకపై ఐదు ప్రశ్నలు మాత్రమే ఇస్తామని, వాటన్నింటినీ రాయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విధానాన్ని 2025 నుండి అమలు చేయనున్నారు.

