Andhra PradeshHome Page Slider

రాజమండ్రిలో జయప్రద..

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు ఫిబ్రవరి 27న మృతి చెందిన సంగతి తెలిసిందే. జయప్రద రాజమండ్రి చేరుకొని సోదరుడు రాజబాబు అస్థికలు రాజమండ్రి పుష్కర ఘాట్ లో కలిపారు. జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. రాజబాబు మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. వారి కుమారుడు సామ్రాట్ ని తీసుకువచ్చి ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే అస్తికులు కలపడం జరిగిందని జయప్రద చెప్పారు. ఈరోజు ఏడో రోజు రాజమండ్రి ప్రజలు ఈ గోదారమ్మ తల్లి మోక్షాన్ని ప్రసాదించాలని ఆ శివుడు మా తమ్ముడికి మోక్షం కలిగించాలని, మా తమ్ముడు కుమారుడు సామ్రాట్ తో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఆమె తెలిపారు.