Home Page SliderNational

ఆ ఇద్దర్నీ కాదని NTR కే ప్రాధాన్యం అన్న జాన్వీ

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఐతే, జాన్వీ కపూర్ తాజాగా ఎన్టీఆర్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ తాను ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్ట పడతారో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌లలో మీరు ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు, జాన్వీ కపూర్ భిన్నంగా సమాధానమిచ్చింది.

విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌ ఇద్దర్నీ కాదని, జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేసేందుకు తాను ఇష్టపడతాను అని జాన్వీ చెప్పింది. ‘ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్‌తో ఓ సాంగ్ చేశా. మరో సాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని జాన్వీ కపూర్ తెలిపింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.