నేడు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర..
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఇప్పటికే యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కౌలు రైతుల కుటుంబాలకు ఒక లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థిక సాయం చెక్కులు అందించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేన పార్టీలో చేరనున్నారు.
