News AlertTelangana

“మై హార్ట్ ఈజ్ బీటింగ్” సాంగ్‌కు చిందులు తొక్కిన పవన్ ఫ్యాన్స్

పవన్‌కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు. విడుదలైన 14 ఏళ్ల తర్వాత తిరిగి రిలీజ్ చేసిన జల్సా మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈమధ్య తెలుగు సినిమాలలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ జల్సా సినిమా అప్పట్లోనే రికార్డులు తిరగరాసింది. ఈసినిమాలో సంజయ్‌సాహుగా పవన్‌కళ్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. పవన్- ఇలియానాల లవ్ స్టోరీ, బ్రహ్మానందం కామెడీ, దేవిశ్రీ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా అలరించాయి. పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను నిన్న రాత్రి రీ రిలీజ్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా 720 జల్సా షోలు ప్రదర్శింపబడగా, అన్నీ హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. దీనితో భారతీయ సినిమాలో రీరిలీజ్‌లో ఇదే అత్యధిక షోలు ప్రదర్శించిన చిత్రంగా నిలిచిందని సినీవిశ్లేషకులు అంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ కూడా గురువారం రాత్రి థియేటర్‌లో అభిమానులతో కలిసి, ఈసినిమా వీక్షించారు. మరోచోట మైహార్ట్ ఈజ్ బీటింగ్ పాటను ఆడియన్స్ అందరూ కలిసి పాడారు. ఇటీవల పోకిరి సినిమా రీ రిలీజ్ కూడా జరిగింది. అది కూడా హిట్ టాక్‌ను సాధించింది.