News

మహానాడు వేదికపై జలిల్ ఖాన్ కు అస్వస్థత..

కడప మహానాడు వేదికపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు అస్వస్థత గురయ్యారు. వేదికపై స్పృహ తప్పి కుప్పకూలి పడిపోయారు. హుటాహుటిన జలీల్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం టీడీపీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. కడపలోని ఆస్పత్రిలో జలీల్ ఖాన్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే.. మహానాడులో భోజనం కోసం పోలీసులు తిప్పలు పడ్డారు. మహానాడు కార్యక్రమం బందోబస్తు కోసం వచ్చిన 5వేల మంది పోలీసులకు భోజనం అందక పోయేసరికి ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులకు భోజనం అందించే వాహనం రావడంతో ఒక్కసారిగా ఎగబడిన పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.