జగ్గారెడ్డి సంచలన నిర్ణయం
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్మే తూర్పు జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవ్వరు ఊహించని విధంగా 2023లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయేది లేదని స్పష్టం చేశారు. కావాలంటే తన స్థానంలో కార్యకర్తను నిలబెడతానన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దంటే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదనే అంశం పై స్పష్టత ఇవ్వని జగ్గారెడ్డి 2028 ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగ్గారెడ్డి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తీరుపై నేరుగా సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు.