ఎమ్మెల్సీ పదవిపై జగ్గారెడ్డి క్లారిటీ..
ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీ పదవి అడగటం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులు అనుకూలించక ఎమ్మెల్యేగా ఓడిపోయినట్లు తెలిపారు. ‘నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. పార్టీ నాకు మరోసారి టికెట్ ఇచ్చింది. పరిస్థితులు అనుకూలించక ఓడిపోయిన. పదే పదే ఎమ్మెల్సీ కావాలని అడిగే గుణం నాది కాదన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు.

