ఆస్ట్రేలియాలో జగన్ జన్మదిన వేడుకలు..
వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను నేడు (డిసెంబర్ 21) రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభిమానులు జరుపుకుంటున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్‌కు ట్వీట్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలో సుదీర్ఘకాలం ఉండాలని కోరుకున్నారు. అలాగే దేశవిదేశాలలో జగన్ అభిమానులు కూడా ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన వేడుకలలో వైసీపీ నాయకులు, అభిమానులతో కలిసి గాయం శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ తదితరులు కేక్ కట్ చేసి ఉత్సవం చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకుని, ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

