జగనన్న విదేశి విద్యాదీవెన నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించడం కోసం విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రభుత్వం ఈ జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను విడుదల చేసింది. కాగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి 357 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ45.53 కోట్లను జమ చేశారు. ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్లు..ఇతరులకు రూ.కోటి వరకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ఏపీలో ప్రతిభ ఉండి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ పథకం గొప్పవరంగా మారింది. కాగా ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లో చదవాలనే తమ కోరికను తీరుస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

