గుడిలో శిల్పంలా జగన్ తయారయ్యాడు.. వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా
ఇప్పటి వరకు వైసీపీపై ఏ నాయకుడి చేయని రీతిలో విమర్శలు చేశాడు మంత్రి గుమ్మనూరు జయరాం. తనను పార్టీ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కోరిందన్న జయరాం, తనకు అది ఇష్టం లేదని చెప్పారు. టీడీపీ తరపున గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నానన్నారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులున్నారని… గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి చెప్పిందే చేస్తున్నారన్నారు. పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో పసుపు కండువా కప్పుకుంటున్నానన్నారు.

