Andhra PradeshHome Page Slider

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.కాగా ఆయన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన స్పీకర్ వద్దకు వెళ్లి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దానికి ముందు జగన్ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు నమస్కారం చేశారు.