Andhra PradeshHome Page Slider

“వినుకొండలో రషీద్ హత్య జగన్ రెడ్డి స్కెచ్”:టీడీపీ

ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల జరిగిన రషీద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా జిలాని అనే వ్యక్తి తన స్నేహితుడైన రషీద్‌ను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.అయితే ఈ హత్య జగన్ రెడ్డి స్కెచ్ అని టీడీపీ ఆరోపించింది. జగన్ కావాలనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేలా భారీ కుట్రకు తెరతీశారని పేర్కొంది. అయితే రషీద్ హత్య జరిగిన సమయంలో ఇద్దరు వైసీపీ నాయకులు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారిద్దరికి ఆశ్రయం కల్పించిన అద్దంకికి చెందిన వైసీపీ నేతను కూడా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే వారు దొరకగానే జగన్ రెడ్డి డ్రామా బయట పడుతుందని టీడీపీ ట్వీట్ చేసింది.