Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTrending Todayviral

మరో యాత్రకు జగన్ సిద్ధం …!

  • మాజీ సిఏం జగన్ పర్యటనలు వివాదాస్పదం.
  • జగన్ పర్యటనల పై ఆంక్షలు విధింపు…
  • జగన్ అభిమానులు ,కార్యకర్తలు మరియు నేతలపై కేసులు

జైలులో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి . తాజాగా నెల్లూరులో జగన్ పర్యటనలకు వెళ్లిన నేతల పై పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇక, ఇప్పుడు జగన్ గోదావరి ప్రాంత యాత్రకు సిద్ధమయ్యారని పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు రాజకీయంగా ఈ పర్యటన పై మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ వరుసగా పరామర్శల కోసం ఆయా జిల్లాలకు వెళ్తున్నారు. పల్నాడు పర్యటన లో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పర్యటనల కు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని జగన్ పర్యటనల ను వైసీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భారీగా జనం వస్తుండటం తో తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేస్తున్నారు. తన పర్యటనల పైన ఎందుకు ఇంతగా భయపడుతున్నారని జగన్ ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జైలులో కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించటాన్ని టీడీపీ నేతలు తప్పు బడుతున్నారు . జగన్ పర్యటన ల పై పెడుతున్న ఆంక్షలను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు జగన్ సిద్దమయ్యారు. ఈ నెల 5న రాజమండ్రి జైలులో లిక్కర్ కేసు రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డి పరామర్శకు జగన్ వెళ్లనున్నారు గత నెల 20న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహా బ్లాక్ లో ఉన్నారని గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయం లోనూ ఇదే బ్లాక్ లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను జగన్ ఇప్పటికే ఖండించారు. అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాగా, జగన్ రాజమండ్రి పర్యటనకు వెళుతున్న వేళ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనకు మరోసారి పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు రాజమండ్రి పర్యటన పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది .