Andhra PradeshHome Page Slider

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. CPS విధానాన్ని రద్దు చేస్తూ,ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నారు. 12 వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా పచ్చజెండా ఊపింది. యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్‌మెంట్ 62 సంవత్సరాల వయస్సుకు అంగీకరించారు. జిల్లా కేంద్రాలన్నింటిలో 16 శాతానికి హెఆర్‌ఏను పెంచింది. కొత్త డిఏ అమలుకు కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీ సందర్భంగా ఎమ్మెల్యేలతో రాబోయే ఎన్నికల గురించి కూడా చర్చించినట్లు సమాచారం అందింది. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.