వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చిన జగన్
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డికి సీఎం జగన్ బీఫామ్స్ అందించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులను కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు ముఖ్యమంత్రికి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పోటీలో లేకుంటే ఏపీ రాజ్యసభ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.